హెలికాప్ట‌ర్ ప్రమాదంపై ఊహాగానాలు వ‌ద్దు: వాయుసేన‌

న్యూఢిల్లీ: త‌మిళ‌నాడులోని నీల‌గిరి కొండ‌ల్లో ఆర్మీ హెలికాప్ట‌ర్ ఎంఐ-17 వీ5 కూలిన ఘ‌ట‌న‌లో సీడీఎస్ చీఫ్ బిపిన్ రావ‌త్‌తో పాటు మొత్తం 13 మంది మృతిచెందిన విష‌యం తెలిసిందే. అయితే ఈ ఘ‌ట‌న‌పై అసంబ‌ద్ధ ప్ర‌చారాలు జ‌రుగుతున్న‌ట్లు ఇవాళ వాయుసేన త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు. నిరాధార ఆరోప‌ణ‌ల‌ను ఆపేయాల‌ని ఆ ట్వీట్‌లో ఐఏఎఫ్ కోరింది. త్వ‌ర‌లోనే ప్ర‌మాద ఘ‌ట‌న‌కు చెందిన వాస్త‌వాలు బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని చెప్పింది. రావ‌త్ దంప‌తుల‌తో పాటు ర‌క్ష‌ణ‌ద‌ళ సిబ్బంది మృతి ప‌ట్ల త్రివిధ‌ద‌ళ ద‌ర్యాప్తు చేప‌ట్ట‌నున్న‌ట్లు ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాథ్ తెలిపిన విష‌యం తెలిసిందే. త్వ‌రిత‌గ‌తిన ఈ ఘ‌ట‌న ప‌ట్ల విచార‌ణ‌ను పూర్తి చేయ‌నున్న‌ట్లు ఐఏఎఫ్ తెలిపింది. దీని కోసం ద‌ర్యాప్తు క‌మిటీని కూడా ఏర్పాటు చేసిన‌ట్లు ఐఏఎఫ్ చెప్పింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/