బన్నీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ : దేశముదురు రీ రిలీజ్ డేట్ ఫిక్స్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు గుడ్ న్యూస్. అల్లు అర్జున్ నటించిన దేశ ముదురు మూవీ రీ రిలీజ్ కు సిద్ధమైంది. ఇటీవల కాలంలో హీరోల తాలూకా బర్త్ డే రోజున వారు నటించిన చిత్రాలను రీ రిలీజ్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. పవన్ కల్యాణ్​ ‘ఖుషి’, ‘జల్సా’, మహేశ్ బాబు ‘పోకిరి’, వెంకటేశ్ ‘నారప్ప’, బాలకృష్ణ ‘చెన్నకేశవ రెడ్డి’, రామ్ చరణ్ ఆరెంజ్ తదితర చిత్రాలు రీ–రిలీజ్ అయి అభిమానులను అలరించాయి. ఈ క్రమంలో ఇప్పుడు అల్లు అర్జున్ – పూరి కలయికలో 2007 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన దేశ ముదురు చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నారు. అల్లు అర్జున్-హన్సికా మోట్వాని జంటగా నటించిన ఈ చిత్రంలో ప్రదీప్ రావత్, ఆలీ, జీవా, సుబ్బరాజు, జీవీ, అజయ్, రఘుబాబు, రాజా రవీంద్ర, శ్రీనివాస్ రెడ్డి, రాజేష్, వంశీ, రమాప్రభ, కోవై సరళ, తెలంగాణ శకుంతల తదితరులు నటించగా, చక్రి సంగీతం అందించారు.

అప్పట్లో ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఈ చిత్రంలోని సాంగ్స్ ఇప్పటికే వినిపిస్తూనే ఉంటాయి. అలాంటి ఈ మూవీ అల్లు అర్జున్ బర్త్ డే (ఏప్రిల్ 08) సందర్బంగా ఏప్రిల్ 06 న రీ రిలీజ్ చేయబోతున్నట్లు DVV ఎంటర్టైన్మెంట్స్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. పుష్ప తో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్..ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో బిజీ గా ఉన్నారు.