తెలంగాణ లో భారీగా ఐపీఎస్‌ల బదిలీ

తెలంగాణ లో మరోసారి భారీ ఎత్తున ఐపీఎస్‌ల బదిలీ చేసింది రాష్ట్ర సర్కార్. పది..ఇరవై కాదు ఏకంగా 91మంది ఆఫీసర్లను బదిలీ చేసింది. వనపర్తి, సిరిసిల్ల, మహబూబ్ నగర్, రామగుండం, కరీంనగర్ ఎస్పీలు, సీపీలు బదిలీ అయ్యారు. మల్కాజ్ గిరి డీసీపీగా జానకి దరావత్, రామగుండం సీపీగా సుబ్బారాయుడు, తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా రాజీవ్ రతన్, ఉమెన్ సేఫ్టీ ఎస్పీగా పద్మజ, ఖమ్మం సీపీగా సురేశ్, జగిత్యాల ఎస్పీగా భాస్కర్ బదిలీ అయ్యారు.

దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. ఉత్తర్వులు వచ్చాక ఎవరెవరు ఎక్కడెక్కడికి బదిలీ అయ్యారు అనే దానిపై పూర్తిగా క్లారిటీ వస్తుంది. జనవరి 4న 29మంది ఐపీఎస్ ల బదిలీలు జరిగాయి. ఈ నెలలోనే ఐపీఎస్ ల బదిలీలు జరగడం ఇది రెండోసారి. రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి భారీ సంఖ్యలో ఐపీఎస్ లను బదిలీ చేయడం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది.