జనవరి 30 న దసరా టీజర్ రిలీజ్

నేచురల్ స్టార్ నాని – కీర్తి సురేష్ జంటగా తెరకెక్కుతున్న దసరా మూవీ తాలూకా టీజర్ అప్డేట్ ను మేకర్స్ ప్రకటించారు. ఈ నెల 30 న దసరా ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా గా మార్చి 30 , 2023 లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్నాడు.

ఈ సినిమాలో నాని బొగ్గు గ‌నిలో ప‌ని చేసే కార్మికుడి పాత్ర‌లో క‌నిపిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు మారే చిత్రంలో న‌టించ‌ని విధంగా గుబురు గ‌డ్డం పెట్టుకుని కార్మికుడు ఎంత మాసీగా ఉంటాడో అలాంటి లుక్‌లో కనిపించ‌బోతున్నారు నాని. అలానే సాయికుమార్, స‌ముద్రఖని తదితర సీనియర్ యాక్టర్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. గత ఏడాది ‘అంటే సుందరానికి’ మూవీతో ఊహించని డిజాస్టర్‌ని చవిచూసిన నాని.. దసరా మూవీలో ఫుల్ మాస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, గ్లింప్స్ మూవీపై అంచనాల్ని పెంచేస్తూ వచ్చాయి. ఇక టీజర్ ఎలా ఉండబోతోందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జనవరి 30 న ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించి అభిమానుల్లో సంతోషం నింపారు.