దేశంలో కొత్తగా 5,910 కరోనా కేసులు

53,974కి తగ్గిన యాక్టివ్ కేసులు

corona virus-india

న్యూఢిల్లీః దేశంలో కరోనా రోజువారీ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ప్రజా జీవనం మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటోంది. గత 24 గంటల్లో 2.27 లక్షల మందికి కోవిడ్ టెస్టులను నిర్వహించగా… కొత్తగా 5,910 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 7,034 మంది మహమ్మారి నుంచి కోలుకోగా… 9 మంది మృతి చెందారు. కేరళ తన గణాంకాలను సవరించడంతో.. మరణాల సంఖ్య 16కి పెరిగింది.

ఇక ప్రస్తుతం దేశంలో 53,974 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,44,62,445కి చేరుకుంది. వీరిలో 4,38,80,464 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 5,28,007 మంది మరణించారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేపు 2.60 శాతానికి తగ్గిపోయింది. క్రియాశీల రేటు 0.12 శాతంగా, రికవరీ రేటు 98.69 శాతంగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 213.52 కోట్ల డోసుల వ్యాక్సిన్ ను పంపిణీ చేశారు. నిన్న 32.31 లక్షల మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/international-news/