లోకేశ్ పాదయాత్రతో తమకు ఇబ్బంది లేదుః బాలినేని

AP Minister Balineni
AP Minister Balineni

అమరావతిః వైఎస్‌ఆర్‌సిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తనను కలవడంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. స్నేహపూర్వకంగా సాయిరెడ్డి తనను కలిశారని చెప్పారు. తమ మధ్య రాజకీయపరమైన అంశాలపై చర్చ జరగలేదని అన్నారు. ప్రకాశం జిల్లా రీజనల్ కోర్డినేటర్ బాధ్యతలను విజయసాయిరెడ్డికి అప్పగిస్తారని చెప్పారు. టిడిపి యువ నేత నారా లోకేశ్ చేస్తున్న పాదయాత్రతో తమకు ఇబ్బంది లేదని అన్నారు. లోకేశ్ పాదయాత్రను తాము ఎక్కడా ఆపలేదని చెప్పారు. ప్రజల కోసం వాలంటీర్లు ఎంతో కష్టపడి పని చేస్తున్నారని కితాబిచ్చారు. వాలంటీర్లను విమర్శించడం సరికాదని చెప్పారు.