నేడు నిజామాబాద్‌లో పర్యటించనున్న సిఎం కెసిఆర్‌

TS CM Kcr- cabinet meeting on 30th
TS CM Kcr

హైదరాబాద్ః నేడు సిఎం కెసిఆర్‌ నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో బయల్దేరి నిజామావాద్ లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ కి ఆయన చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి ప్రత్యేక బస్సులో బయల్దేరి ఎల్లమ్మగుట్టలో నూతనంగా నిర్మించిన టిఆర్ఎస్ కార్యాలయానికి చేరుకుంటారు. టిఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తారు.

అనంతరం నూతన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని కెసిఆర్ ప్రారంభిస్తారు. కలెక్టరేట్ లో పూజలు నిర్వహించిన అనంతరం… జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని సీట్లో కూర్చోబెడతారు. ఆ తర్వాత అక్కడి నుంచి గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల మైదానానికి సిఎం చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ఆయన ప్రసంగిస్తారు. మరోవైపు కెసిఆర్ పర్యటన నేపథ్యంలో నిజామాబాద్ గులాబీమయంగా మారింది. ఇంకోవైపు పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందు జాగ్రత్త చర్యగా పలువురు విద్యార్థి నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/