3వ పాశురం: తిరుప్పావై

ఆధ్యాత్మిక చింతన:

3rd Pashuram: Thiruppavai
3rd Pashuram: Thiruppavai

ఓజ్గియులగళన్ద ఉత్తమన్‌ పేర్పాడి
నాజ్గళ్‌ నంపావెక్కు, చ్చాణ్‌ణినీరాడినాల్‌
తీజ్గిని€నాడెల్లామ్‌, తిజ్గళ్‌ ముమారిపెయ్ దు
ఓజ్గుపెరుంశెన్నె లూడకయలుగళ
ప్పూజ్గువళైప్పోదిల్‌, పొఱివణ్డుకణ్పడుప్ప
తేజ్గాదేపుక్కిరున్దు, శీర్తములైపణ్‌ణి
వాజ్గ. కుడంనిఱైక్కుం, వళ్ళల్‌ప్పెరుంపశుక్కళ్‌
నీజ్గాదశెల్వం, నిఱైన్దేలో రెమ్బావాయ్ మూడవపాట
వామనునిగవచ్చి, వాయువేగమున ఎదిగి అంబరంబున కెగసి, మూడులోకముల కొల్చిదేవాదిదేవతలు సేవించు దేవుని శ్రీహరిని కీర్తించి స్తోత్రములపాడి
శ్రీపాదసేవకై తీర్థమాడినోచ అవనియంతయు దుర్బిక్షమంతరించు
నెలమూడువానలై పైరుపంటలు ఎదుగు ఎర్రకలువలు విరయు, తుమ్మెదలు మురియు
పాలసంపద పెరగు, లోకమున శాంతి పెరుగు పరమేశ్వరుడు మెచ్చు, పరలోకములు మెచ్చు
ఇట్లు మన నోము మంచి ఫలమునిచ్చు.

భావం:

బలి చక్రవర్తి వామనుడికి మూడడుగుల దానము ఇచ్చాడు. మూడు అడుగులతో మూడు లోకాలు తన పాదముతో కొలిచాడు వామనుడు. అతనిని మనము కీర్తించుదాము. నెలకు మూడు వానలు పడాలి. వరిచేలు బాగా పండాలి. చేపలు పుష్కలంగా ఉంటాయి. కలువ పూలు వికసిస్తాయి. తుమ్మెదలు వాటి మకరం దాన్ని సేవించి మత్తుతో నిదురిస్తాయి. పొదుగు తాకగానే పుష్కలంగా కడవలకొద్ది పాలిచ్చే గోవ్ఞలు ఉండాలి. దేశము తరగని సిరులతో నిండి ఉండాలి. ప్రజలు సుఖం గా ఉండాలి. వ్రతమను వంకతో మనమంతా స్నానము చేయుదము రండని గోపికలను ఆహ్వానిస్తున్నది.

ఫలం: ఇహలోక, పరలోక సంపద పొందుటకు.

తాజా ‘మొగ్గ ‘(చిన్నారుల ప్రత్యేకం) కోసం : https://www.vaartha.com/specials/kids/