ఆరోగ్యానికి వంటింట్లో దినుసులు

ఆహారం- ఆరోగ్యం

Ingredients in kitchen for health
Ingredients in kitchen for health

రోజూ మనం వంటిల్లో అనేక రకాల మసాలా దినుసుల్ని ఉపయోగిస్తాం. వీటిని రుచి కోసం మాత్రమే వాడుతామని అనుకుంటారు. కానీ.. ఇవి కేవలం రుచి తేవడం మాత్రమే కాదు.

ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయన్న సంగతి చాలా మందికి తెలీదు. ఇవి మన శరీరంలో ఏ పాత్ర పోషిస్తున్నాయోచూద్దాం.

పసుపుకు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో ఎంతో ఉపయోగపడు తుదంది. శరీరం లోని రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా, కఫం, వాత, పిత్తం రోగాలను నయం చేసే గుణం కలిగి వుంది.

అలాగే మహిళ ల ఈ పసుపులో అలోవెరా గుజ్జుని కలుపుకుని ముఖానికి రాస్తే ముఖారవిందం పెరుగుతుంది. పసుపును వేడి నీటిలో లేదా పాలలో కలుసుకుని సేవిస్తే జలుబు, పొడ దగ్గు లాంటివాటికి ఉపశమన లభించి.. గొంతులో, ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం బయటకు వచ్చేస్తుంది.

జీలకర్ర :జీలకర్ర జీర్ణక్రియను సాఫీగా ఉంచుతుంది. కడుపు ఉబ్బరంగా ఉండటం. ఆహారం తినేందుకు మనస్కరించకపోవడం, ఆజీర్తి లాంటి వాటితో సతమతమౌతుంటే జీలకర్ర సేవిస్తే ఉపశమనం కలుగుతుంది. ఈ జీలకర్రని నిమ్మరసముతో కలిపి సూర్యోదయం, సూర్యాస్తమ సమయాల్లో తింటే.. తలతిరుగుడు, కడుపులోని వేడి మొదలగు పైత్యరోగాలు తగ్గుతాయి.

మెంతులు : మధుమేహ రోగులకు మెంతులు ఎతో ఉపయోగకరంగా ఉందంటున్నారు వైద్యులు. ప్రతిరోజజు మెంతులు తీసుకోవడం లన రక్తం పలుచగా తయారువుతుంది. పరిగడుపున మెంతులను నీళ్లతో కలిపి తీసుకుంటే మెకాళ్ల నొప్పులతో పాటు మధుమేహ వ్యాధి అదుపులో వుం టుంది. వీటితోపాటు శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగించడంలో ఇవి ఉపయోగ పడతాయి.

ఆవాలు: ఆవాలు జీర్ణవ్యవస్థను వృద్ధిచేస్తాయి. ప్రతిరోజూ నాలుగు గ్రాముల నల్ల ఆవాలను మింగి నీరు తాగితే జీర్ణశక్తి వృద్ధి చెందుతుంది. మల బద్ధకం పోతుంది. ఇవి మైగ్రేన్‌ తలనొప్పి ఉపశమనానకి కూడా ఎంతో ఉపయోగపడుతాయి.

వీటిని నీటితో కలిపి మెత్తగా నూరి తలనొప్పి వస్తున్న వైపు లేపనంగా రాస్తే మైగ్రేన్‌ నొప్పి తగ్గిపోతుంది. జలుబు వల్ల ముక్కు నుంచి నీరు కారుతుంటే పాదాలపైన, పాలకాంద ఆవాల తైలాన్ని రాస్తే తెల్లారేరికి మంచి గుణం కనిపిస్తుంది. అంతేకాకుండా, వాంతులు తీవ్రంగా వున్నప్పుడు ఆవాల పిండిని నీటితో కలిపి తాగితే వాంతి రావడం ఆగిపోతుంది. ఆ తర్తా నల్ల ఆవాల పిండిని తడిచేసి పొట్టమీదరాయాలి.

ధనియాలు : ధనియాలు జీర్ణక్రియ సమస్యలకు ఒక చికిత్సగా ఉంటాయి. అంతేకాకుండా, ధనియాల కషాయంలో పంచదార కలిపి తాగితే మంచి నిద్ర వస్తుంది.

ధనియాలు, జీలకర్ర, మిర్చి, కరివేపాలను నేతిలో వేయించి ఉప్పు కలిపి భద్రపరిచి ప్రతిరోజూ అన్నంతో తింటే రుచి పెరుగు తుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. ధనియాలను పేస్టులాగా మెత్తగా నూరి తలమీద వేసుకుంటే తలనొప్పి వేడి తగ్గుతాయి

తాజా ‘నిఘా’ వార్తల కోసం : https://www.vaartha.com/specials/investigation/