అర్ధమంతా అరచేతిలోనే

ఆధ్యాత్మిక చింతన

The whole thing is in the palm of your hand
The whole thing is in the palm of your hand

కొంతమంది ఎదుటివారిని చూసి వారు రెండు చేతులతో సంపాదిస్తున్నారంటారు. అంటూ కేవలం చేతులే సంపాదిస్తాయా? కాదు

ఆ చేతులతో కష్టపడి పనిచేస్తేనే ఎవరికయినా ఆర్థికంగా కాస్త బాగుంటుంది. కాకపోతే పైసలు సంపాదించటంలో చేతులదే ప్రముఖ పాత్ర.

చెమటోడ్చి పనిచేసే వాడికి రెండు చేతులు బాగుంటేనే రోజూ పనిచేసుకుని తన కుటుంబాన్ని పోషించుకోగలుగుతాడు.

అదే విధంగా భగవంతుడు కూడా మనకు ఏ దేవాలయములోనయినా అభయముద్ర, వరముద్రతోనే దర్శనమిస్తాడు.

మనం దేవుళ్లని దర్శించుకున్నప్పుడు ఆ అభయముద్రను చూడగానే మనక ఎంతో ఆనందంగా, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

అంటే దేవాలయంలోని మూర్తి నుండి అభయముద్ర ద్వారా మనకు ఏదో తెలియని శక్తి, వరం ప్రసాదించినట్లుగా అనిపిస్తుంది.

అదేవిధంగా మన ఇళ్లల్లో ఉండేటటువంటి దేవుడి ఫొటోల్లో కూడా దేవుడి ఫొటోల నుండి కనిపించే అభయముద్ర,

వరముద్రలో నుండి కొన్ని కిరణాలు మనవైపు ప్రసరిస్తున్నట్లుగా, అవి మనలోనికి ప్రవేశిస్తున్నట్లుగా, వాటి ద్వారా మనకు ఏవో అతీత శక్తులు వస్తున్నట్లుగా అనిపిస్తుంటుంది.

అదేవిధంగా లక్ష్మీదేవి ఫొటోల్లో ఉంటాయని చేతుల నుండి బంగారు నాణేలు, రూపాయి నాణేలు ఒక పళ్లెంలో పడుతున్నట్లుగా ఉంటాయి.

అంటే మనం దేవుళ్లను ఆరాధించగానే అంతటి ధన, కనకరాశులు మనకు లభిస్తాయని కాదు. భగవంతుని సేవించటం వల్ల మనకు ఆ భగవంతుడు ఎలాంటి కష్టాలు రాకుండా కాపాడతాడని అర్ధం.

అలాంటి ముద్రలకు అర్ధం నేనున్నాననే భావనను భగవంతుడు మనకు కల్పిస్తాడు.

అంతేకానీ ప్రార్థించగానే కావలసినన్ని డబ్బులు, బంగారాన్ని మనకు ఇవ్వడు. అలా సాధ్యం కాదు. అభయ ముద్రలు, వరముద్రలు మనిషికి ఒక మార్గాన్ని చూపిస్తాయి.

నిర్దేశిస్తాయని చెప్పడానికే. మంచి ఏది, చెడు ఏది, ఏ పని చేయాలి.ఏ పని చేయకూడదని చెబుతాడు భగవంతుడు.

‘ కరాగ్రే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి కర మూలే గౌరీ

అన్నారు పెద్దలు. అరచేయి వ్రేళ్ల చివర్లో లక్ష్మీదేవి, అరచేతి మధ్యభాగంలో సరస్వతి, అరచేతి క్రిందిభాగంలో గౌరీదేవి (శక్తి) ఉంటుందని అర్ధం.

ఎవరికయినా కొంత మొత్తం ధనాన్ని అప్పుగా ఇవ్వాలన్నా, మన దగ్గర ఉన్న డబ్బును జాగ్రత్త చేసుకోవాలన్నా చేయి దాటి పోతే మళ్లీ మన చేతికి వచ్చేంతవరక కష్టమే.

కాబట్టి ధనాన్ని మన చేతులు దాటిపోకుండా జాగ్రత్త పడాలని దాని అర్థం.

ఎవరికయినా ఆర్థిక సాయం చేయాలన్నా మన సొమ్మును మనం తీసుకోవాలనుకున్నా చేతి చివర్లలోనే తీసుకుంటాం.

కాబట్టి లక్ష్మీదేవి చేయి చివరిభాగంలోనే ఉంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా ‘కర మధ్యే సరస్వతి అనగా మనిసి జ్ఞానాన్ని పెంచుకోవటానికి గ్రంథాలను,.

పుస్తకానలు తన అరచేతిలోనే పట్టుకుని చదువుకోవాలి. తద్వారా జ్ఞానం సంపాదించి, తాను నేర్చుకున్న విద్యతో నలుగురికి మేలు చేస్తు కూడా సంపాదించుకోవచ్చు.

అంటే సరస్వఇ ఎపుపడు మనిషి యొక్క అరచేతిలోనే నిక్షిప్తమై ఉంటందని చెప్పవచ్చు.

అదేవిధంగా ‘కర మూలే గౌరీ అనగా అరచేయి యొక్క కింది భాగం గట్టిగా ఉంటుంది. అక్కడ గౌరీదేవి ఉంటారు.

మనిషి ఎప్పుడయినా క్రిందపడినపుడు భూమిపై అరచేయి కిందిభాగాన్ని భూమికి గట్టిగా అదిమిపెట్టి లేచేటువంటి ప్రయత్నం చేసాతం.

శక్తి అంటే కూడా ఆ భాగంలో నిక్షిప్తమై ఉంటుంది.

– శ్రీనివాస్‌ పర్వతాల

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/