తిరుమల శ్రీవారికి ఓ అజ్ఞాత భక్తుడు భారీ విరాళం..

శ్రీ‌వారికి రూ.3.5 కోట్ల బంగారు క‌ఠి, వ‌ర‌ద హ‌స్తాల విరాళం

తిరుమల : తిరుమ‌ల శ్రీ‌వారికి ఈ రోజు ఉద‌యం ఓ అజ్ఞాత‌ భ‌క్తుడు భారీ కానుకలు స‌మ‌ర్పించుకున్నాడు. ఆ భ‌క్తుడు చెన్నైకు చెందిన ఓ వ్యాపారి అని తెలుస్తోంది. వేంక‌టేశ్వ‌రుడికి బంగారు క‌ఠి, వ‌ర‌ద హ‌స్తాలను విరాళంగా ఇచ్చాడు. 3.5 కోట్ల రూపాయ‌ల‌తో ఆ ఆభ‌ర‌ణాలు త‌యారు చేయించాడు.

వీఐపీ ద‌ర్శ‌న‌ ప్రారంభ స‌మ‌యంలో వాటిని శ్రీ‌వారికి స‌మ‌ర్పించాడు. మొత్తం 6 కిలోల బంగారు కఠి, వరద హస్తాలను టీటీడీ అర్చ‌కుల‌కు ఆయ‌న అందజేశాడు. వాటిని ఈ రోజు అభిషేక సేవ అనంతరం స్వామి వారికి అర్చకులు అలంకరించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/