కీసర గుట్ట రేపటి నుంచి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు

keesaragutta-shivaratri-brahmotsavam-2023

హైదరాబాద్‌: కీసర గుట్టలో రేపటి నుండి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 16 వ తేదీ నుండి 21 వరకు జరుగనున్న ఈ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కాళీ నడకన కీసర గుట్ట ఆలయ ప్రాంగణం, ఎక్సబిషన్ గ్రౌండ్ ను తిరిగి పనులను పరిశీలించారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఐదు రోజుల క్రితం కీసర గుట్ట శివరాత్రి ఏర్పాట్లను సదర్శించనని కలెక్టర్ ఈ రోజు ఏర్పాట్లపై సదర్శించి పనులు బాగా జరిగయని అన్నారు. రేపటి నుంచి శివరాత్రి బ్రహ్మోస్తవాలు ప్రారంభం కానున్నాయని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ట్రాఫిక్ ను దృష్టిలో ఉంచుకొని ఫ్లెక్స్ లు కూడా బ్యాన్ చేసామని ఆయన తెలిపారు. రెండు మూడు రోజులు ఇక్కడే ఉండే భక్తుల వాహనాలు ఆపకుండా పోలీసులుతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.