ఒడిశాలో కొత్తగా 3,384 పాజిటివ్‌ కేసులు

Corona cases crossed 2 crore 31 lakhs worldwide
Corona cases crossed 2 crore 31 lakhs worldwide

భువనేశ్వర్‌: ఒడిశాలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. తాజాగా 3,384 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 90,986కు చేరింది. ప్రస్తుతం 27,672 యాక్టివ్‌ కేసులు ఉండగా, 62,813 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. గడిచిన 24గంటల్లో 7 మంది మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 448కి చేరిందని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. నిన్న ఒకే రోజు 68,090 కరోనా టెస్టులు చేయగా, మొత్తం 15,53,257 టెస్టులు చేసినట్లు వివరించింది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/