తెలంగాణలో కొత్తగా 2,273 కరోనా కేసులు

మొత్తం మరణాల సంఖ్య 996

telangana-corona virus

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా 2,273 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న మొత్తం 55,636 మందికి పరీక్షలు నిర్వహించగా ఈ కేసులు బయటపడ్డాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,62,844 మంది ఈ మహమ్మారి బారినపడినట్టు నిర్ధారణ అయింది. ఈమేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ‌లో పేర్కొంది. ఇక, గత 24 గంటల్లో కరోనా కారణంగా 12 మంది మృతి చెందడంతో రాష్ట్రంలోని మొత్తం కరోనా మరణాల సంఖ్య 996కు చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 2,260 మంది కోలుకోవడంతో ఈ మహమ్మారి బారినుంచి మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 1,31,447కు పెరిగింది. రాష్ట్రంలో ఇంకా 30,401 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. వీరిలో 23,569 మంది హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఇక, రాష్ట్రంలో ఇప్పటి వరకు 22,76,222 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/