ఎన్‌సీసీ కార్యకలాపాల కోసం ప్రత్యేక యాప్ ప్రారంభం
న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ) కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌ను ఈరోజు ప్రారంభించారు. ‘డీజీఎన్‌సీసీ (డైరెక్టరేట్ జనరల్ నేషనల్ క్యాడెట్ కార్ప్స్) ట్రైనింగ్’ యాప్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. కరోనా నేపథ్యంలో ఎన్‌సీసీ శిక్షణ కార్యక్రమాలు నిలిచిపోయాయి. అయితే డీజీఎన్‌సీసీ మొబైల్ ట్రైనింగ్ యాప్ ఆ లోటును తీరుస్తుందని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఎన్‌సీసీ క్యాడెట్లు డిజిటల్ మాధ్యమంలో శిక్షణ పొందేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. కరోనా నేపథ్యంలో విధించిన నిబంధనల వల్ల ఎన్‌సీసీ క్యాడెట్లు ప్రత్యక్షంగా శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనలేని ఇబ్బందులను ఈ యాప్ ద్వారా అధిగమించవచ్చని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/