ఏ క్షణంలోనైనా ఎమ్మెల్సీ కవిత బయటకు వచ్చే అవకాశం

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో భాగంగా ఈరోజు ఈడీ ముందుకు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు కవిత ఈడీ ఆఫీస్ లోకి వెళ్లగా..దాదాపు 8 గంటలుగా ఆమెను అధికారులు ప్రశ్నిస్తూనే ఉన్నారు. మధ్యలో 10 నిముషాలు కవితకు బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం ఈడీ ఆఫీస్ వద్ద పోలీసులు అలర్ట్ అవుతున్నారు. కార్యాలయం వద్ద ఉన్న నేతలను పంపిస్తున్నారు. ఏక్షణమైనా కవిత బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

ఈడీ ఆఫీస్ నుంచి కవిత బయటికి రాగానే ఆమెను ఇంటికి తీసుకెళ్లడానికి వాహనాలను అధికారులు సిద్ధంగా ఉంచారు. ముఖ్యంగా ఢిల్లీలోని సీఎం కేసీఆర్ నివాసం దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఇవాళ ఉదయం నుంచే బీఆర్ఎస్ శ్రేణులు ఢిల్లీ భవన్ దగ్గర ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యి భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇక విచారణ తర్వాత కవిత ఏం చేయబోతున్నారు..? మీడియాతో మాట్లాడుతారా..? ఢిల్లీలోని నివాసానికి వెళ్తారా లేకుంటే హైదరాబాద్‌కు పయనం అవుతారా..? అని బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈడీ విచారణ ముగిస్తే.. ఇవాళే హైదరాబాద్‌కు కవిత బృందం బయల్దేరనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.