అగ్రరాజ్యంలో ఆగని కరోనా మరణాలు

గత 24గంటల్లో 3,176 కరోనా మృతులు

america
america

వాషింగ్టన్‌: కరోనా దెబ్బకు అగ్రరాజ్యం అతలాకుతలం అవుతుంది. అక్కడ కరోనా మరణాలు 51 వేలకు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో అమెరికాలో 3,176 కరోనా మరణాలు సంభవించాయి. తాజా గుణంకాలు పరీశీలిస్తే అమెరికాలో 8.86లక్షల మంది కరోనా బారినపడ్డారు. అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీ, మసాచుస్సెట్స్ రాష్ట్రాల్లో మహమ్మారి తీవ్రత అధికంగా ఉంది. ఇప్పటి వరకు న్యూయార్క్‌లో 2.68లక్షల మంది కరోనా బారినపడగా.. 20,861 మంది మరణించారు. న్యూజెర్సీలో కరోనా బాధితుల సంఖ్య లక్ష దాటింది. 5,428 మంది ప్రాణాలు కోల్పోయారు. మసాచుస్సెట్స్‌లో 46వేల మందికి కరోనా సోకగా.. 2,360 మంది మృతి చెందారు. ఇదిలా ఉంటే.. కరోనా కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే పనిలో ట్రంప్ బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా అమెరికాలో లాక్‌డౌన్‌ను ఎత్తేసేందుకు సిద్ధపడుతున్నారు. మూడు దశల్లో లాక్‌డౌన్‌ను ఎత్తేసేందుకు ఇప్పటికే మార్గదర్శకాలు కూడా విడుదల చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/