గుజరాత్లో ఆరువేల మంది ఏపి మత్స్యకారులు
వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు: రాహుల్‌గాంధీ

న్యూఢిల్లీ: దేశంలో లాక్డౌన్ విధించడంలో ఏపికి చెందిన మత్స్యకారులు గుజరాత్లో చిక్కుకుపోయారని, గత నెల రోజులుగా వారు దుర్బర పరిస్థితులను ఎదుర్కోంటున్నారని, తినేందుకు తిండిలేక, వైద్య సదుపాయం లేక అనారోగ్యాల పాలై మరణిస్తున్నారు. అక్కడ వారికి సరైన సదుపాయాలు లేక ఇబ్బందులుపడుతున్నారు. దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఇందుకు సంబందించి జాతీయ మీడియాలో వచ్చిన ఓ వార్తను ఆయన పోస్ట్ చేశారు. సుమారు ఆరువేల మంది ఏపికి చెందిన మత్స్యకారలు గుజరాత్లో చిక్కుకు పోయారని, నెలరోజులుగా వారు తమ చిన్నపాటి పడవల్లోనే ఉంటూ తిండి, నీళ్లు కూడా లేక అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు. వారందరిని వసతి గృహల్లోకి తరలించి వారికి కావలసిన సదుపాయాలు అందించాలని కోరారు. కాగా మత్స్యకారులు తామందరం చనిపోతామనే భయంతో భతుకుతున్నాయని మీడియాకు తెలిపారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/international-news/