బిఆర్ఎస్ పార్టీ కి మరో షాక్ తగలబోతుందా..?

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ బిఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. పార్టీ లోని కీలక నేతలు వరుస పెట్టి పార్టీ కి రాజీనామా చేసి వేరే పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ పార్టీ లో చేరగా..తాజాగా మరో మహిళా నేత పార్టీ ని వీడనున్నట్లు తెలుస్తుంది.

జోగులాంబ గద్వాల జడ్పీ చైర్ పర్సన్ సరిత ..టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని రేవంత్ ఇంట్లో సరిత, ఆమె భర్త తిరుపతయ్య భేటీ కాగా…కాంగ్రెస్ లో చేరేందుకు సముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో కొల్లాపూర్ జూపల్లి చేరిక సభలో ఆమె కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.

మరోపక్క రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీ లో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..తాజాగా బిఆర్ఎస్ నుండి దాదాపు 20 కి పైగా ఎమ్మెల్యేలు , పలువురు ఎంపీలు కాంగ్రెస్ పార్టీ లో చేరబోతున్నట్లు కామెంట్స్ చేయడం మరింత టెన్షన్ పెట్టిస్తుంది. గతంతో పోలిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ బలం పెరిగింది. వరుస పెట్టి ఇతర పార్టీల నేతలు , కీలక వ్యక్తులు కాంగ్రెస్ లో చేరేందుకు మొగ్గు చూపిస్తున్నారు. ఎన్నికల సమయానికి కాంగ్రెస్ లో చాలామందే చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.