ప్రారంభమైన ఏపి అసెంబ్లీ సమావేశాలు

YouTube video

2nd Meeting of Third Session of 15th Legislative Assembly Day 04 

అమరావతి: ఏపి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నాలుగో రోజు ప్రారంభమయ్యాయి. ఎడ్యుకేషన్‌ యాక్ట్‌ సవరణ బిల్లును అసెంబ్లీలో వైఎస్‌ఆర్‌సిపి సర్కారు ప్రవేశపెట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంపై సభలో చర్చ కొనసాగుతోంది. వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే వరప్రసాద్ అసెంబ్లీలో ప్రసంగిస్తూ.. భవిష్యత్తు తరాల్లో మార్పు రావాలంటే ఇంగ్లిష్ విద్య తప్పనిసరని తెలిపారు. ప్రస్తుతం విద్య అనేది సవాలుగా మారిందని అన్నారు. అసమానతలు తొలగాలంటే అందరికీ విద్య అవసరమని అన్నారు. సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగాలంటే అందరికీ విద్యే మార్గమని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాడునేడు కార్యక్రమం మంచినిర్ణయమన్నారు. పోటీ ప్రపంచంలో ఇంగ్లిష్ విద్య అవసరమని తెలిపారు. ఇంగ్లిష్ మీడియం తప్పనిసరిపై జగన్‌ తీసుకున్న నిర్ణయం గొప్పదని చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/