జనసేన పార్టీలోకి వైస్సార్సీపీ నేత బొంతు రాజేశ్వరరావు..?

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ వైస్సార్సీపీ నేత బొంతు రాజేశ్వరరావు..జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఆదివారం పవన్ కల్యాణ్‌తో ఈయన భేటీ కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ రాష్ట్ర మాజీ సలహాదారు అయిన రాజేశ్వరరావు హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్‌తో భేటీ అయ్యారు.

ప్రస్తుతం ఏపీలో రాజకీయ వేడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికలను టార్గెట్ గా పెట్టుకొని అన్ని పార్టీలు వారి వారి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో రాజోలు నియోజకవర్గ వైస్సార్సీపీ నేత బొంతు రాజేశ్వరరావు జనసేన పార్టీ లో చేరబోతున్నారని , ఈ నెల 15 వ తేదీన జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది నిజం చేస్తూ.. ఆ ప్రచారం నిజం అనేలా.. అందుకు ఆయన తీరు కూడా కారణం అవుతోంది. ఇటీవల బొంతు రాజేశ్వరరావు పుట్టినరోజు వేడుక్కి.. జనసేన కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. బొంతు రాజేశ్వరరావు పుట్టిన రోజు వేడుకల్లో సందడి చేశారు. నిన్న నేరుగా పవన్ కళ్యాణ్ ను కలవడం జరిగింది. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.