దొంగచాటు ప్రేమ వ్యవహారం చివరకు ప్రాణాలు పోయేలా చేసింది

ఈ మధ్య వయసు తో సంబంధం లేకుండా ప్రేమలో పడుతున్నారు. ఆ ప్రేమ ఎంతకైనా తెగించేలా చేస్తుంది. చివరకు ప్రాణాలు తిసేవరకు కూడా వెళ్తుంది. తాజాగా పదో తరగతి విద్యార్థుల ప్రేమ వ్యవహారం చివరకు ప్రాణం పోయేలా చేసింది. ఈ ఘాతాం మహారాష్ట్రలోని వైజాపూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే..వైజాపూర్ ప్రాంతంలో నివసించే సచిన్ కాలే (15) అనే మైనర్ బాలుడు.. స్థానిక స్కూల్ లో 10వ తరగతి చదువుతున్నాడు. కాగా, సచిన్ కాలే రోజూ స్కూల్ కు వెళ్తూ వస్తున్న క్రమంలోనే ఇతనికి ఓ మైనర్ బాలికతో పరిచమైంది. అతి తక్కువ టైంలోనే ఆ ఇద్దరు బాగా దగ్గరయ్యారు. ఆ దగ్గరా కాస్త ప్రేమకు దారితీసింది. రోజు గంటలకొద్దీ ఇద్దరూ ఛాటింగ్ లు చేసుకోవడం , ఇంట్లో వారికీ తెలియకుండా బయట కలుసుకోవడం వంటివి చేస్తూ వచ్చారు. ఇదిలా ఉంటే తాజాగా సచిన్ కాలే తన ప్రియురాలి ఇంట్లో ఎవరు లేరని తెలిసి ఇంటికి వెళ్లాడు. రాత్రిపూట ఇద్దరూ దొంగచాటున మాట్లాడుకుంటుండగా..అప్పుడే బాలిక తల్లిదండ్రులు వచ్చారు. దొంగచాటుగా ఉన్న వారిద్దర్నీ చూసి కోపంతో కూతురు ప్రియుడిని దారుణంగా హత్య చేసాడు. ఇక మరుసటి రోజు ఆ బాలుడి శవాన్ని పరిసర ప్రాంతాల్లో పడేశారు. స్థానికులు ఆ శవాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ఆ బాలుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసుల విచారణలో సచిన్ కాలేను హత్య చేసింది అతని ప్రియురాలి తల్లిదండ్రులు అని తేలింది. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.