చంద్రబాబునాయుడు స్వభావం బయటపడింది

vijaya sai reddy
vijaya sai reddy

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడిపై వెఎస్సార్‌సిపి ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. బెజవాడ రౌడీలా ప్రవర్తించి పార్టీకి మంచి పేరు తెచ్చావని 40 ఇయర్స్‌్‌ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఒక ఎమ్మెల్సీని మెచ్చుకుని తన స్వభావాన్ని బయట పెట్టుకున్నారని ఎంపీ విమర్శించారు. ఇలాంటి వ్యక్తులు రాష్ట్రానికి ఎంత ప్రమాదకారులో ప్రజలకు పూర్తిగా తెలిసిపోయిందని అన్నారు. చంద్రబాబు నాయుడు తన మనుగడ కోసం ఎంత నీచానికైనా దిగజారుతాడని విజయసాయిరెడ్డి మండిపడ్డారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/