బాలికపై మాజీ సర్పంచ్‌ అత్యాచారం

దేహశుద్ధి చేసిన గ్రామస్థులు

Girl raped
Girl raped

ఖమ్మం : మైనర్ బాలికపై మాజీ సర్పంచ్ అత్యాచారం చేసిన సంఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలోని ఓ గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మాజీ సర్పంచి కేతిరెడ్డి కోటి రెడ్డి(65) ఇంటికి ఓ బాలిక తన తండ్రికి ఫోన్ చేయడానికి వెళ్లింది. తండ్రితో ఫోన్‌లో మాట్లాడిని అనంతరం మిరపకాయలు కావాలని తీసుకరావాలని ఇంట్లోకి పంపించాడు. ఇంట్లోకి వెళ్లగానే గడియవేసి అమ్మాయిపై కోటి రెడ్డి అత్యాచారం చేశాడు. తన కూతురు ఇంకా రాలేదని వెతుక్కుంటూ కోటిరెడ్డి ఇంటికి తల్లి వెళ్లింది. మాజీ సర్పంచ్ ఇంటి నుంచి ఏడ్పు వినపడడంతో బాలిక తల్లి ఆరా తీసింది. జరిగిన విషయం గ్రామస్థులకు తెలియగానే అతడిపై దాడి చేశారు. గ్రామస్థుల సమాచారం మేరకు ఎసిపి వెంకట్ రెడ్డి, సిఐ సత్యనారాయణ రెడ్డి, ఖమ్మం సిఐ అంజలి ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన కోటి రెడ్డి స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కోటిరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ సతీష్ కుమార్ వెల్లడించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/