దేశంలో కొత్తగా 2,710 కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు క్రితం రోజుతో పోల్చితే స్వల్పంగా పెరిగాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు కొత్తగా 2,710 కేసులు వెలుగుచూశాయి. మరో 14 మంది ప్రాణాలు కోల్పోయారు . ఒక్కరోజే 2,296 మంది కరోనాను జయించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్​ బారినపడి కోలుకున్నవారి శాతం 98.75గా ఉంది. దేశవ్యాప్తంగా గురువారం 14,41,072మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 192,97,74,973కు చేరింది. ఒక్కరోజే 4,65,840 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.

కాగా, ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగానే నమోదవుతున్నాయి. క్రితం రోజుతో పోల్చితే మాత్రం స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 5,67,240 మందికిపైగా వైరస్​ బారినపడ్డారు. మరో 1,427 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 53,01,57,770కు చేరింది. మరణాల సంఖ్య 63,07,663కు చేరింది. ఒక్కరోజే 5,97,520 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 50,06,7,229గా ఉంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/