రేపటి నుంచి షిర్డీ సాయినాథుడి దర్శనం

ముంబయి: మహారాష్ట్రలోని ప్రముఖ షిర్డీ సాయిబాబా ఆలయాన్ని ఈ నెల 7 నుంచి తిరిగి తెరువనున్నారు. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుతుండటంతో ఆలయ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతిరోజు దాదాపు 15,000 మంది భక్తులకు దర్శనం కల్పించాలని నిర్ణయించింది. ఆలయానికి వచ్చే భక్తులు కరోనా మార్గదర్శకాలను పాటించాలని, మాస్కులను తప్పనిసరిగా ధరించాలని సూచించింది. గర్భిణిలు, 10 ఏండ్లలోపు పిల్లలు, 65 ఏండ్లు దాటిన వృద్ధులకు అనుమతి లేదని పేర్కొంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/