తమిళనాడులో 27 మంది జర్నలిస్టులకు కరోనా

రిపోర్టర్లతో పాటు సబ్ ఎడిటర్లకు సోకిన కరోనా వైరస్

corona virus
corona virus

తమిళనాడు: తమిళనాడులో ఓ ప్రముఖ ఛానెల్ లో పని చేస్తున్న జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ వచ్చింది. రిపోర్టర్లతో పాటు సబ్ ఎడిటర్లు సహా మొత్తం 27 మందికి పాజిటివ్ గా తేలింది. అదే సంస్థలో పని చేస్తున్న ఓ జర్నలిస్ట్ కు తొలుత కరోనా పాజిటివ్ రావడంతో అక్కడే పని చేస్తున్న మొత్తం 94 మందికి కూడా పరీక్షలు నిర్వహించారు. ఇందులో 26 మంది ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. వీరిని క్వారంటైన్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ముంబయిలో 53 మంది జర్నలిస్టులు కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/