అవినీతి పాకిస్థాన్‌ క్రికెట్‌ను భ్రష్టుపట్టించింది

జహీర్‌ అబ్బాస్‌ అభిప్రాయం

zaheer abbas
zaheer abbas

కరాచీ: అవినీతి మకిలీ పాకిస్థాన్‌ క్రికెట్‌ను భ్రష్టు పట్టించిందని అది ఎంతలా అంటే 2009 లో శ్రీలంక జట్టుపై ఉగ్రదాడితో వచ్చిన చెడ్డపేరుకన్నా ఇది మరింత అప్రతిష్ట చేకూర్చిందని పాకిస్థాన్‌ మాజీ ప్లేయర్‌ జహీర్‌ అబ్బాస్‌ అన్నాడు. అవినీతి ఆరోపణలు వచ్చిన వెంటనే కఠిన చర్యలు తీసుకోకుండా.. ఉపేక్షించడడం వల్ల కుంభకోణాలకు దారీ తీశాయని, యువ ఆటగాళ్లకు తప్పుడు సంకేతాలు వెళ్లాయి అని అన్నారు. అలాగే ప్రతిభ కలిగిన వాళ్లు ఆటకు దూరమయ్యారు అని, దీని కారణంగా పాక్‌ క్రికెట్‌ పై గౌరవం లేకుండా పోయిందని జహీర్‌ అబ్బాస్‌ అభిప్రాయపడ్డాడు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/