తెలంగాణలో స్కూల్ ఫీజులపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
రాబోయే విద్యా సంవత్సరంలో విద్యా సంస్థలు ఫీజులను ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచవద్దు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కారణంగా ప్రజలు ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కెసిఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో స్కూల్ ఫీజులపై కీలక ప్రకటన చేసింది. రాబోయే విద్యా సంవత్సరంలో విద్యా సంస్థలు ఫీజులను ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. మొన్న జరిగిన మీడియా సమావేశంలో తెలంగాణసిఎం కెసిఆర్ ఈ మేరకు ప్రకటన కూడా చేశారు. ఈరోజు దీనిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి… ఇందుకు సంబంధించి అన్ని స్కూల్స్‌కు, ఇతర విద్యా సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని అధికారులకు తెలియజేశారు. తాజాగా ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కాగా ఈ జీవో ప్రకారం వచ్చే విద్యా సంవత్సరం(2020- 2021)లో ప్రైవేటు స్కూల్స్ ఫీజులను పెంచరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/