దేశంలో కొత్తగా 2,568 కరోనా కేసులు

దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 33,917

corona virus-india

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 2,568 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇదే సమయంలో 4,722 మంది కరోనా నుంచి కోలుకోగా, 97 మంది మృతి చెందారు. రోజువారీ పాజిటివిటీ రేటు 0.37 శాతానికి తగ్గింది. ఇప్పటి వరకు మన దేశంలో 4,24,46,171 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం 5,15,974 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 33,917 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

అయితే దేశ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య పెరగడం గమనార్హం. ముందురోజు 27గా ఉన్న మరణాల సంఖ్య… 24 గంటల వ్యవధిలోనే 97కి పెరిగింది. కొన్నిరోజులుగా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నప్పటికీ… మరణాల విషయంలో మాత్రం హెచ్చుతగ్గులు వస్తున్నాయి. గత 24 గంటల్లో 97 మరణాలు సంభవించగా… వాటిలో ఒక్క కేరళలోనే 78 మరణాలు నమోదయ్యాయి. మరోవైపు ఇప్పటి వరకు 180 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు వేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/