కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వకపోవడం వివక్ష కాదా? : మంత్రి కేటీఆర్

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్ర సర్కారు నిర్లక్ష్యం చూపుతోందని చెప్పారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వరు? అంటూ ట్వీట్ చేశారు.
“మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని నిలదీస్తూ ట్వీట్ చేశారు. అప్పర్ భద్ర ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు హోదా ఇవ్వకపోవడం వివక్ష కాదా? అన్నారు. తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా బీజేపీ ఎంపీలు చోద్యం చూస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.”
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/