తన చివరి రక్తపుబొట్టు దాకా జగన్ తోనే ఉంటానంటున్న ప్రసన్నకుమార్ రెడ్డి

ఎమ్మెల్సీ ఎన్నికలతో ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంటూ నలుగురు ఎమ్మెల్యేల ఫై జగన్ వేటు వేయడం తో ..ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పుడు ప్రభుత్వం ఫై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నేతలు వైస్సార్సీపీ ని వీడబోతున్నారని చెపుతున్నారు. ఇదే తరుణంలో పలువురి పేర్లు ప్రచారం అవుతుండడం తో వారంతా ఒక్కరుగా ప్రచారాన్ని ఖండిస్తూ వస్తున్నారు. తాజాగా తాను పార్టీ మారుతానంటూ వస్తున్న వార్తలపై ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు మైండ్ గేమ్‌లో భాగంగానే తనపై దుష్ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. తన చివరి రక్తపుబొట్టు దాకా జగన్ తోనే ఉంటానని స్పష్టం చేశారు.

తాను ఎవరినీ సంప్రదించలేదని ప్రసన్నకుమార్ రెడ్డి స్పష్టంచేశారు. ఎమ్మెల్యేల్లో గందళగోళం సృష్టించడానికి గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. తనకు రాజశేఖర్ రెడ్డి కుటుంబం మీద ప్రత్యేక గౌరవని.. జగన్ తనను చాలా బాగా చూస్తారని అన్నారు. జగన్‌తోనే తన పయనమని, తాను చనిపోయినా తన కొడుకు రజత్ కుమార్ రెడ్డి.. జగన్ వెంటే ఉంటారని తెలిపారు.