టీఆర్ఎస్ నేతకు ఈసీ షాక్..

వరంగల్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరికి EC షాక్ ఇచ్చింది. దసరా రోజున టిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. కేసీఆర్ దేశానికి ప్రధాని అవ్వాలని కోరుతూ.. వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ నేత రాజనాల శ్రీహరి..పేద హమాలీలకు 200 కోళ్లను మరియు 200 క్వార్టర్ బాటిల్లను పంపిణీ చేశారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ వ్యాప్తంగా జాతీయ పార్టీ పెట్టబోతున్న శుభ సందర్భంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సీఎం కేసీఆర్‌.. దేశ ప్రధానమంత్రి కావాలని అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షుని గా కేటీఆర్ ఎంపికై రాబోయే ఎన్నికల్లో వారు ముఖ్యమంత్రి కావాలని కోరుతూ.. ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

కాగా మునుగోడు ఓటర్లకు లిక్కర్ పంపిణీ చేశారన్న ఆరోపణలపై ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈసీ స్పందించింది. ఈ మేరకు వరంగల్ జిల్లా కలెక్టర్ ను వివరాలు కోరింది. రాజనాల శ్రీహరికి వరంగల్ కలెక్టర్ ఈసీ నోటీసులు అందజేశారు. రెండు రోజుల్లో దీనిపై మద్యం, చికెన్ పంపిణీపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మరి దీనిపై రాజనాల ఎలా సమాధానం చెపుతారో చూడాలి.