ఏపీలో కొత్తగా 2,068 కరోనా కేసులు

అమరావతి : ఏపీలో గడచిన 24 గంటల్లో 80,641 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,068 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 337 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 315, కృష్ణా జిల్లాలో 251, ప్రకాశం జిల్లాలో 207, నెల్లూరు జిల్లాలో 205 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 18 కేసులు గుర్తించారు. అదే పమయంలో 2,127 మంది కరోనా నుంచి కోలుకోగా, 22 మంది మరణించారు. ఒక్క ప్రకాశం జిల్లాలోనే ఆరుగురు మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 19,64,117 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా… 19,29,565 మంది పూర్తి ఆరోగ్యం సంతరించుకున్నారు. ఇంకా 21,198 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 13,354కి పెరిగింది

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/