నేడు సిఎం పదవికి రాజీనామా చేయనున్న నితీష్ కుమార్ ?

nitish-kumar-resigns-as-cm-of-bihar

న్యూఢిల్లీః బీహార్ రాజకీయ పరిణామాలు క్షణక్షణానికి ఉత్కంఠ రేపుతున్నాయి. నేడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు నితీష్ కుమార్. ఇక రేపు జేడీయూ శాసనసభాపక్ష సమావేశం ఉండనుంది. బిజెపితో కలిసి ప్రభుత్వ ఏర్పాటు చేయనున్నారు నితీష్ కుమార్. నితీష్ వెంట పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లిపోయే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.

కాగా, కాగా, కేంద్రంలో ప్రధాని నరేంద్రమోడీని సర్కార్ను గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పాటైన ఇండియా కూటమి నెమ్మదిగా చీలుతోంది. ఈ కూటమికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని కూలదోయాలనుకున్న కాంగ్రెస్ పార్టీకి ఈ కూటమిలోని పార్టీలు ఒక్కొక్కటిగా షాక్ ఇస్తున్నాయి. ఇప్పటికే ఆప్, టీఎంసీలు సార్వత్రిక ఎన్నికల్లో తమ రాష్ట్రాల్లో ఒంటరిగానే పోరాడతామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ కూటమిలో కీలక పార్టీ అయిన జేడీయూ చీఫ్ నీతీశ్ కుమార్ కూడా ఇండియాకు గుడ్ బై చెప్పారు.