అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని పొడిగించిన భారత్

ఆగస్ట్ 31 వరకు అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని పొడిగించిన ప్రభుత్వం

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి దెబ్బకు అల్లాడిపోతున్న ప్రపంచ దేశాలను… ధర్డ్ వేవ్ భయాలు వణికిస్తున్నాయి. పలు దేశాల్లో ఇప్పటికే థర్డ్ వేవ్ ప్రారంభమయిందనే వార్తలు వస్తున్నాయి. మన దేశంలో సైతం క్రమంగా మళ్లీ పాజిటివ్ కేసులు పెరుగుతుండటం ఆందోళనను పెంచుతోంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ ప్యాసింజర్ విమానాల రాకపోకలపై నిషేధాన్ని ఆగస్ట్ 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డీజీసీఏ నుంచి ఉత్వర్వులు జారీ అయ్యాయి.

అంతర్జాతీయ విమానాల రాకపోకలపై విధించిన నిషేధం 2021 ఆగస్ట్ 31 అర్ధరాత్రి 23.59 గంటల వరకు కొనసాగుతుందని ఉత్తర్వుల్లో డీజీసీఏ పేర్కొంది. ఈ నిషేధం కార్గో (రవాణా) విమానాలకు వర్తించదని తెలిపింది. అయితే కొన్ని సెలెక్ట్ చేసిన రూట్లలో అవసరాలను బట్టి కేస్ టు కేస్ బేసిస్ కింద అంతర్జాతీయ ప్యాసింజర్ విమానాలను అనుమతిస్తామని వెల్లడించింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/