షర్మిల పార్టీకి కీలక నేత రాజీనామా

రాజీనామా చేసిన చేవెళ్ల ప్రతాప్ రెడ్డి

హైదరాబాద్ : వైయస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల పార్టీకి ఊహించని షాక్ తగిలింది. పార్టీకి చేవెళ్ల ప్రతాప్ రెడ్డి రాజీనామా చేశారు. పార్టీ నేత రాఘవరెడ్డి వ్యవహారశైలికి నిరసనగా రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. తన రాజీనామా లేఖను పార్టీ ప్రధాన కార్యాలయానికి పంపించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ప్రతాప్ రెడ్డి ఇన్ఛార్జిగా వ్యవహరించారు. ఆయన రాజీనామా చేయడం పార్టీలో అంతర్గతంగా కలకలం రేపుతోంది. పార్టీలో అప్పుడే ఆధిపత్య పోరు మొదలైందని కొందరు అంటున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/