దేశంలో కొత్తగా 185 కరోనా కేసులు

corona virus-india

న్యూఢిల్లీః దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నది. రద్దీ ప్రదేశాల్లో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, కరోనా నిబంధనలు పాటించాలని కేంద్ర ప్రభుత్వం సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో కొత్తగా 185 కరోనా వైరస్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,46,76,515కు చేరాయి. ఇందులో 4,41,42,432 మంది కోలుకున్నారు. మరో 3402 కేసులు యాక్టివ్‌గా ఉండగా, ఇప్పటివరకు 5,30,681 మంది మృతిచెందారు. కాగా, గత 24 గంటల్లో మహమ్మారికి ఒకరు బలయ్యారు.

రికవరీ రేటు 98.72 శాతంగా ఉండగా, యాక్టివ్‌ కేసులు 0.01 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 2,20,02,12,178 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని తెలిపింది. బుధవారం ఒక్కరోజే 1,17,538 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని పేర్కొన్నది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/