ఇండియన్స్ కు మలేషియా శుభవార్త

ఇకపై మలేషియాకు వీసా లేకుండానే వెళ్లి రావచ్చు

Malaysia
Malaysia

మలేషియా: మలేషియాకు వెళ్లాలని భావించే భారతీయులకు శుభవార్త. ఇకపై ఎటువంటి వీసాను తీసుకోకుండానే ఆ దేశానికి వెళ్లి రావచ్చు. ఇంతవరకూ ముందుగా వీసా తీసుకుని మాత్రమే మలేషియాకు వెళ్లే వీలుండగా, ఇప్పుడు ఆ నిబంధనను రద్దు చేస్తున్నట్టు మలేషియా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని వెల్లడించిన ఏపీ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు విజయ మోహన్‌, ఇకపై ఆన్ లైన్ లో పేరు నమోదు చేసుకుని మలేషియాలో పర్యటించవచ్చని తెలిపారు. నేపాల్, శ్రీలంక తదితర దేశాలకు వెళ్లేలాగానే అక్కడికీ వెళ్లిరావచ్చని అన్నారు. ఈ మేరకు భారత పౌరులకు సరికొత్త సౌలభ్యాన్ని మలేషియా సర్కారు కల్పించిందని అన్నారు.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/