రాహుల్ గాంధీ యాత్రను అడ్డుకోవాలని కేంద్రం కుట్ర : కాంగ్రెస్ ఆరోపణ

Center conspiracy to block Rahul Gandhi’s yatra: Congress alleges

న్యూఢిల్లీః దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. భారత్ జోడో యాత్రలో కరోనా రూల్స్ పాటించేలా చూడాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ సూచించారు. ఒకవేళ రూల్స్ పాటించలేకపోతే కొంతకాలం యాత్రను ఆపాలని కోరారు. రాహుల్‌ తో పాటు రాజస్థాన్ సీఎంకు మాండవీయ లెటర్ రాశారు. ‘‘రాజస్థాన్ ఎంపీలు పీపీ చౌదరి, నిహాల్ చంద్, దేవ్ జీ పటేల్ నాకు లెటర్ రాశారు. జోడో యాత్రలో కరోనా రూల్స్ పాటించేలా ఆదేశాలివ్వాలని కోరారు. లేదంటే యాత్రను ఆపాలని విజ్ఞప్తి చేశారు. యాత్రలో పాల్గొన్న హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్ విందర్ సింగ్ కరోనా బారినపడిన విషయాన్ని నా దృష్టికి తెచ్చారు” అని లెటర్​లో పేర్కొన్నారు.

అయితే ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ మండిపడింది. ‘‘పార్లమెంట్ యథావిధిగా కొనసాగుతోంది. రాజస్థాన్, కర్నాటకలో బీజేపీ యాత్రలు కొనసాగుతున్నాయి. మరి ఒక్క భారత్ జోడో యాత్రనే ఆపాల్సిన అవసరం ఏంటి?” అని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ ప్రశ్నించారు. రాహుల్ యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, అందుకే దాన్ని ఆపాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ‘రాహుల్ యాత్రకు ప్రజల నుంచి వస్తున్న మద్దతు చూసి బీజేపీ భయపడుతోంది. అందుకే యాత్రను అడ్డుకుంటోంది’ అని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ మండిపడ్డారు. గుజరాత్ ఎన్నికల టైమ్​లో ప్రధాని మోడీ కొవిడ్ రూల్స్ పాటించారా? అని ఎంపీ అధిర్ రంజన్ చౌదురి ప్రశ్నించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/