‘బాక్’ సెన్సార్ కంప్లీట్

మే 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల

Raashii khanna still from ‘Back’ Movie

అత్యంత విజయవంతమైన హారర్ కామెడీ సిరీస్ ‘అరణ్మనై’ నుంచి నాల్గవ చిత్రం అరణ్మనై 4 తెలుగులో ‘బాక్’ పేరుతో వస్తోంది. సుందర్ సి దర్శకత్వంతో పాటు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, రాశి ఖన్నా హీరోయిన్స్. తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. మే 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ‘పంచుకో’ పాట అద్భుతమైన రెస్పాన్స్ తో చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. అవ్నీ సినిమాక్స్ P Ltd పతాకంపై ఖుష్బు సుందర్, ACS అరుణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్, కోవై సరళ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ LLP తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది.

తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/category/telangana/