దేశంలో కొత్తగా 17,135 కరోనా కేసులు

యాక్టివ్​ కేసులు.. 1,37,057

corona virus -india

న్యూఢిల్లీః దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం మధ్య 17,135 మందికి వైరస్​ నిర్ధరణ కాగా..మరో 47 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్​ నుంచి 19,823 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.49 శాతానికి చేరింది. భారత్​లో మంగళవారం 23,49,651 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 204.84 కోట్లు దాటింది. మరో 4,64,919 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 8,21,908 మంది వైరస్​ బారినపడగా.. మరో 1,938 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 583,944,874 కు చేరింది. ఇప్పటివరకు వైరస్​తో 64,18,751 మంది మరణించారు. ఒక్కరోజే 1,087,782 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 554,463,913కు చేరింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/