అక్టోబర్ లో మునుగోడు ఉపఎన్నిక..?

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో మునుగోడు ఉపఎన్నిక ఖరారైంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు అక్టోబర్ లో ఉపఎన్నిక జరగనుందని తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ కి , తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్..అతి త్వరలోనే బిజెపి తీర్థం పుచ్చుకొని..బిజెపి నుండి మునుగోడు బరిలో నిలవబోతున్నట్లు తెలుస్తుంది. ఇక టిఆర్ఎస్ పార్టీ నుండి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి దించే ఆలోచనలో ఉన్నట్లు వినికిడి.

ఇక ఇటు కాంగ్రెస్ పార్టీ సైతం ఉప ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది. హుజూరాబాద్ తరహాలో తప్పులు చేయకుండా ముందుగానే అభ్యర్థిని ప్రకటించాలని ఆలోచన చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మానిక్కం ఠాగూర్ ఓ ప్రకటన విడుదల చేశారు.

కాంగ్రెస్ ప్రకటించిన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ వ్యూహం, ప్రచార కమిటీలో ఏడుగురికి చోటు కల్పించింది. మధుయాష్కీ గౌడ్ కమిటీ కన్వీనర్ గా ఉండగా.. రాం రెడ్డి దామోదర్ రెడ్డి, బలరాం నాయక్, సీతక్క, అంజన్ కుమార్ యాదవ్, ఎస్ఏ సంపత్ కుమార్. ఈరవత్రి అనిల్ కుమార్ లను సభ్యులుగా నియమించింది.