తెలంగాణలో తగ్గిన సినిమా టికెట్ ధరలు

PVR Theatre (File)
telangana-government-approves-movie-ticket-price-increase-in-state

తెలంగాణ రాష్ట్ర సినీ లవర్స్ కు గుడ్ న్యూస్. రాష్ట్రంలో మల్టీప్లెక్స్‌ టిక్కెట్ ధరలు తగ్గాయి. రూ. 200 నుండి రూ. 150 కి తగ్గాయి. రీసెంట్ గా తెలంగాణ రాష్ట్ర సర్కార్ సినిమా టికెట్ ధరలు పెంచుకోవచ్చని జీవో రిలీజ్ చేసింది. కరోనా నష్టాన్ని కొంత భర్తీ చేసుకొనేందుకు టికెట్ ల పెంపుకు అవకాశం ఇవ్వాలని ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ జీవో విడుదల చేసింది.

దీంతో ఏసీ థియేటర్లలో కనిష్ట ధర రూ. 50, గరిష్ట టికెట్ ధర రూ. 150. మల్టీఫ్లెక్స్ లో కనిష్ట టికెట్ ధర రూ. 100, గరిష్ట టికెట్ ధర రూ. 250. మల్టీఫ్లెక్స్ రిక్లైనర్ సీట్లకు గరిష్టంగా రూ. 300. టికెట్ ధరలకు జీఎస్టీ, నిర్వహణ చార్జీలు అదనంతో ప్రేక్షకుడి జేబు ఖాళీ అయ్యి..మరోసారి థియేటర్ కు పోకుండా భారీగా పెంచేశారు. ఇక ఇప్పుడు కరోనా నేపథ్యంలో వచ్చే నలుగురు కూడా థియేటర్స్ కు రాకపోవడం తో సినిమా టికెట్ ధరలు తగ్గిస్తున్నట్లు తెలిపారు. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు థియేటర్లలో టికెట్ ధరలు రూ.200, రూ.175, రూ.150గా ఉంటాయి. ఇప్పటి నుంచి కొత్తగా విడుదలయ్యే సినిమాలకు ఈ రేట్లు వర్తిస్తాయని తెలిపారు.

ఇక సంక్రాంతి బరిలో దాదాపు డజన్ చిత్రాలు రిలీజ్ అవుతుండడం తో ప్రేక్షకులకు తగ్గించిన ధరలు కాస్త ఉపశమనం కలిగిస్తాయి కావొచ్చు.