కర్ణాటక ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ ..హైదరాబాద్ స్టార్ హోటళ్లలో 58 రూములు బుక్

కర్ణాటక రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోవడంతో ముఖ్యమంత్రి బస్వరాజు బొమ్మై కు షాక్ తగిలినట్టు అయింది. ఖచ్చితంగా తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేసిన ఆయన ప్రస్తుతం వస్తున్న ఫలితాలతో ఆందోళనలో ఉన్నారు. ముఖ్యమంత్రి బస్వరాజు బొమ్మై సొంత జిల్లా హవేరిలోని ఆరు నియోజకవర్గాలలో ఐదు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. ట్రెండ్స్‌ను బట్టి చూస్తుంటూ కాంగ్రెస్ విజయం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. కర్ణాటకతో పాటు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తలు సంబురాలు మొదలుపెట్టారు.

అయితే బీజేపీ కూడా 80, జేడీఎస్‌కు 30 సీట్లతో కొనసాగుతున్న క్రమంలో కాంగ్రెస్ అప్రమత్తమైంది. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో పడింది. తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురి చేసి లాగేసుకుంటుందనే సమాచారం నేపథ్యంలో కాంగ్రెస్ అలర్ట్ అయింది. దీంతో కాంగ్రెస్ క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. అందులో భాగంగా హైదరాబాద్‌కు ఎమ్మెల్యేలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్ స్టార్ హోటళ్లలో 58 రూములు బుక్ చేశారు కొంత మంది పార్టీ నేతలు. నోవాటెల్ హోటల్లో – 20 రూమ్‌ లు, పార్క్ హయత్ హోటల్లో – 20 రూములు బుక్ చేశారు. తాజ్ కృష్ణ హోటల్లో – 18 రూములు బుక్ చేశారు. ఒక వేళ కర్నాటకలో హంగ్‌ ఏర్పడితే… ఎమ్మెల్యేలను కాపాడుకోవాలనే.. హైదరాబాద్ స్టార్ హోటళ్లలో 58 రూములు బుక్ చేసుకున్నారు.