తెలంగాణలో కొత్తగా 1,478 కేసులు నమోదు

జీహెచ్ఎంసీ పరిధిలో 806 కొత్త కేసులు

corona virus

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. కొత్తగా 1,478 మందికి కరోనా నిర్ధారణ అయింది. దాంతో మొత్తం కేసుల సంఖ్య 42,496కి చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో 806 కొత్త కేసులు వచ్చాయి. నిన్న 1,410 మంది డిశ్చార్జి కాగా, ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 28,705కి పెరిగింది. ప్రస్తుతం 13,389 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో తాజాగా ఏడుగురు కరోనాతో మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలో మొత్తం మరణాలు 403కి పెరిగాయి.

జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు..


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/