కొండాపూర్ కొత్త ఫ్లై ఓవర్ దగ్గర పెనుప్రమాదం తప్పింది

హైదరాబాద్ కొండాపూర్ లో కొత్తగా నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ దగ్గర పెను ప్రమాదం తప్పింది. కిమ్స్ హాస్పిటల్ దగ్గర నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవ‌ర్ మీద నుంచి ఓ పెద్ద ఇనుప క‌డ్డీ కారుపై పడింది. యితే కారు నడుపుతున్న సత్య ప్రవీణ్ అలర్ట్ గా ఉండడంతో ప్రాణాపాయం తప్పింది. కారు ముందు భాగం దెబ్బతిన్నది.

ఈ ఘటన తో షాక్ లో ఉన్న కారు యజమాని ప్రవీణ్ మాట్లాడుతూ.. ఎలాంటి జాగ్ర‌త్తలు పాటించ‌కుండా నిర్మాణ ప‌నులు కొన‌సాగిస్తున్నార‌ని కారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. కాంట్రాక్ట‌రే ప‌రిహారం చెల్లించాల‌ని, ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశాడు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశాన‌ని య‌జ‌మాని తెలిపాడు. ప్ర‌మాదానికి గురైన కారు నంబ‌ర్ టీఎస్ 09 ఎఫ్‌కే 6961.