డ్యూయల్‌ రోల్‌?!

‘సర్కారువారి పాట’ షూటింగ్‌కు రెడీ

Mahesh Babu
Mahesh Babu

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు తన తదుపరి మూవీ షూటింగ్‌కు సిద్దం అవుతున్నారు.. దర్శకుడు పరశురామ్‌తో చేస్తున్న సర్కారు వారి పాట మూవీ షూటింగ్‌ సెప్టెంబర్‌లో మొదలుపెట్టాలనేది యూనిట్‌ ప్లాన్‌.

ఇక ఈ మూవీ కథపై ఆసక్తి రెట్టింపైంది.. ప్రధానంగా ఈ మూవీ ఆర్థిక నేరాలపై తెరకెక్కే క్రైమ్‌, రివేంజ్‌ డ్రామా అయ్యే సూచనలున్నాయని అంటున్నారు.

కాగా ఈచిత్రంపై మరో ఆసక్తికరమైన అప్‌డేట్‌ వెలుగులోకొచ్చింది..మహేష్‌ తొలిసారిగా డ్యూయల్‌ రోల్‌ ట్రై చేస్తున్నారట.. రెండు భిన్నమైన స్వభావాలు కలిగిన ట్విన్స్‌గా కన్పిస్తారనిటాక్‌.

పైగా అభిమానులు కూడ ఆయన్ని ఎప్పటినుంచో డ్యూయల్‌రోల్‌లో చూడాలనే కోరిక ఉంది. ఈచిత్రంలో కీర్తిసురేష్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. థమన్‌సంగీతం అందిస్తున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం :https://www.vaartha.com/news/international-news/