తెలంగాణలో కొత్తగా 1,417 కరోనా కేసులు

మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,58,153

telangana-corona virus

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా 1,417 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,58,153కు చేరింది. తాజాగా మరో 2,479 మంది కోలుకోగా.. 1,27,007 మంది ఇంటికి చేరుకున్నారని చెప్పింది. వైరస్‌ ప్రభావంతో మరో 13 మంది మృత్యువాతపడగా.. ఇప్పటి వరకు 974 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,532 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని పేర్కొంది. తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.61శాతంగా ఉండగా, రికవరీ రేటు 80.1శాతంగా ఉందని వివరించింది. 26,639 మంది హోం ఐసోలేషనల్‌లో ఉన్నట్లు చెప్పింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/