వచ్చే ఏడాది మార్చిలోగా వ్యాక్సిన్
తొలి టీకా నేనే తీసుకుంటాను.. కేంద్రమంత్రి హర్షవర్ధన్

న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ కరోనా వ్యాక్సిన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్ వచ్చే సంవత్సరం మార్చిలోగా సిద్ధం కావచ్చని ఆయన వెల్లడించారు. టీకా సామర్థ్యంపై ప్రజల్లో ఉన్న భయాలను పోగొట్టేందుకు దానిని తొలుత తానే తీసుకుంటానని పేర్కొన్నారు. ఆదివారం నిర్వహించిన ఖసండే సంవాద్గ అనే ఆన్‌లైన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. టీకా అందుబాటులోకి వచ్చిన వెంటనే ఆరోగ్య కార్యకర్తలు, వృద్ధులకు ఇస్తామన్నారు. ఖర్చుతో సంబంధం లేకుండా అత్యవసరమైన వారికి అందిస్తామన్నారు.
టీకాపై ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు తాను వలంటీర్‌గా మారి తొలుత తీసుకుంటానని అన్నారు. ప్రస్తుతం టీకా ధర, భద్రత, ఉత్పత్తి, ఈక్విటీ సహా పలు అంశాలపై చర్చిస్తున్నట్టు చెప్పారు. అలాగే, ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న రెమ్‌డెసివిర్ ఔషధ వినియోగం విషయంలో అక్రమాలు జరుగుతున్నట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. వాటిపై చర్యలు తీసుకోవాలంటూ ఔషధ నియంత్రణ మండలికి సూచించినట్టు మంత్రి తెలిపారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/